Market Opening: నిన్నటి వరకు ఒడిదొడుకుల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాలతో మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు శుభారంబం చేశాయి. వాస్తవానికి అమెరికా సీపీఐ డేటా సానుకూలంగా ఉండటం స్టాక్ మార్కెట్లలో ర్యాలీని పురిగొల్పింది.
ఉదయం 9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 79 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 277 పాయింట్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి. మార్కెట్లు నేడు సానుకూల ధోరణికి కారణం నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియటంగా ఉంది. దీనికి తోడు యూఎస్ బాండ్ ఈల్డ్స్ సైతం తగ్గుదలను నమోదు చేశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆందోళనలు చల్లబడుతున్న వేళ ప్రపంచ మార్కెట్లు తేరుకున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, హీరో మోటార్స్, టీసీఎస్, హిందాల్కొ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, విప్రో, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, సిప్లా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, నెస్లే, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications