Stock Market: సూపర్ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఫోకస్ లో జొమాటో స్టాక్..
Opening Bell: నిన్న ఒడిదొడుకుల తర్వాత స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. నేడు లాభాల ప్రారంభాన్ని నమోదు చేశాయి. అమెరికా నిరుద్యోగిత డేటా విడుదలతో యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగియటం కలిసొచ్చింది.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 293 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 174 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 200 పాయింట్ల మేర లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఉండవచ్చని సానుకూల డేటా నేపథ్యంలో అమెరికన్ మార్కెట్లు ఆగస్టు 29న ట్రేడింగ్‌ను పెంచాయి. యూరోపియన్ మార్కెట్లలో కూడా సానుకూలత కనిపించింది. అలాగే ఆసియా మార్కెట్లలో కూడా బలమైన ట్రేడింగ్ నమోదు కావటం దేశీయ మార్కెట్ల శుభారంబానికి దారి తీసింది.
ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్షియల్స్, హిందాల్కొ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్బీఐఎన్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications