Stock Market: కొత్తవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. లాభాల్లో విప్రో స్టాక్..
Market Opening: గతవారం భారీ ఒడిదొడుకులతో నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఈవారం తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటికీ సానుకూల సంకేతాలతో నేడు దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
ఉదయం 9.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 366 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 332 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 440 పాయింట్లకు పైగా లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోల నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. విప్రో, ఐఆర్ఈడిఏ కంపెనీ షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications