Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు శుభారంభాన్ని నమోదు చేశాయి. వాస్తవానికి వారాంతంలో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్యాంకింగ్ స్టాక్స్ ఒడిదొడుకుల్లో తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 69 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 40 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 182 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తోంది. అయితే మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే బ్యాంకింగ్ సూచీ సైతం కోలుకుంటోంది. మార్కెట్లు ప్రీఓపెన్ సెషన్లోని లాభాల దూకుడును ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, విప్రో, ఎల్ టిఐఎమ్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఎయిర్ టెల్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications