Stock Market: సోమవారం భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. గ్లోబల్ మార్కెట్ల బలంతో..
Market Opening: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్నప్పటికీ నేడు భారతీయ మార్కెట్లు తెరిచే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల మధ్య కొత్తవారాన్ని భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 282 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 83 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 210 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 247 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఓఎన్జీసీ, అషోక్ బుల్డ్కాన్, కరూర్ వైశ్యాబ్యాంక్ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

NSEలో ఓఎన్జీసీ, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టిఐఎమ్, టీసీఎస్, దివీస్ ల్యాబ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, సన్ ఫార్మా, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications