Stock Market: వారాంతంలో మార్కెట్ల కళకళలు.. లాభాల్లో Sensex, Nifty..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల తర్వాత వారాంతంలో లాభలతో ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్ 16 ఏళ్ల గరిష్ఠాలకు చేరుకోవటంతో సంపద ఈక్విటీల నుంచి తరలిపోయింది.
ఉదయం 9.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 134 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 48 పాయింట్ల లాభాల మధ్య ఇంట్రాడే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 68 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 157 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈరోజు మార్కెట్లలో ప్రధానంగా ఐటీ రంగం షేర్లు ఫోకస్ లో ఉన్నాయి.

NSEలో ఎన్టీపీసీ, హిందాల్కొ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, యూపీఎల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, ఎల్ టి, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎయిర్ టెల్, మారుతీ, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications