Stock Market: సూపర్ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. వాటికోసం ఇన్వెస్టర్ల వెయిటింగ్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాలతో మెుదలు పెట్టాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలపై అప్రమత్తతో ఉన్నారు.
ఉదయం 9.25 గంటల సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 206 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా మార్కెట్లలోని ఇన్వెస్టర్లు అమెరికా ఫెడ్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి రుతుపవనాలు, క్రూడ్ ధరలలో స్థిరత్వం ఆర్థిక డేటా ముందుకు వెళ్లడానికి మార్గనిర్దేశకాలుగా నిలుస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణం డేటా, ఫెడ్ నిర్ణయం కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నందున బంగారం స్థిరంగా ఉంది.
ఎన్ఎస్ఈలో ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, ఎల్ టి, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications