Stock Market: లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. బీఎస్ఈ షేర్లు క్రాష్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం మాదిరిగానే లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. నెలాఖరులో మార్కెట్లు కార్పొరేట్ ఫలితాల మార్గదర్శకంలో ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 442 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 356 పాయింట్లు, ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 73 పాయింట్లు లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 3.5 శాతం, బీఎస్ఈ షేర్లు 16 శాతం క్షీణతను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, నెస్లే, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఎల్ టి, టీసీఎస్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications