Stock Market: లాభాల్లో కొనసాగుతున్న Sensex, Nifty.. కొనసాగుతున్న ఎలక్షన్ ర్యాలీ..
Market Opening: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలకతలు ఉన్నప్పటికీ దేశీయంగా ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ రోజు మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 377 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 196 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఓఎన్జీసీ, యూపీఎల్, గ్రాసిమ్, నెస్లే, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టైటాన్, హీరో మోటార్స్, బ్రిటానియా, సిప్లా, కోల్ ఇండియా సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, విప్రో, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హిందాల్కొ, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications