Stock Market: నిన్న ఒడిదొడుకుల మధ్య నష్టాల్లో ట్రేడింగ్ ముగించిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో శుభారంభం చేశాయి. నిన్న మార్కెట్లలో కనిపించిన భయాలు తొలగిపోవటంతో మళ్లీ బుల్స్ రేసులోకి దిగారు.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిన్న భారీగా నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ సూచీ నేడు 176 పాయింట్ల లాభాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 143 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

అమెరికా ఫెడ్ ఈసారి మానిటరీ పాలసీలో రేట్ల పెంపుకు బ్రేక్ వేసింది. అయితే అవసరం మేరకు పాలసీని టైట్ చేస్తామని ఛైర్మన్ పావెల్ స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో అక్కడి మార్కెట్లు ఫెడ్ నిర్ణయాన్ని స్వాగతించటంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, నెస్లే, టాటా స్టీల్, టైటాన్, బ్రిటానియా, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టీసీఎస్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications