Stock Market: కొత్త వారం మార్కెట్లలో బుల్స్ జోరు.. ఫోకస్‌లో బ్యాంకింగ్ స్టాక్స్..
Stock Market: నెల చివరి వారాన్ని స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. ఉదయం మార్కెట్ల ప్రారంభంలో సూచీలు బుల్ జోరుతో ముందుకు సాగటం ప్రారంభించాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇదే క్రమంలో కీలక సూచీ నిఫ్లీ 54 పాయింంట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 195 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 10 సూచీ పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఈ రోజు ప్రధానంగా మార్కెట్లలో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువగా ఫోకస్ లో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలోని సంస్థలు తమ క్యూ4 ఫలితాలను విడుదల చేస్తున్న క్రమంలో ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగియటం కూడా మన మార్కెట్లకు భలాన్ని అందిస్తోంది. ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, రిలయన్స్ వంటి కంపెనీల షేర్లు ట్రెండిగ్ లో ఉన్నాయి.
ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్సల్టెన్సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, విప్రో, అపోలో హాల్సిటల్స్, ఎస్బీఐ లైఫ్, యూపీఎల్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, ఎస్బీఐ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు ఎన్ఎస్ఈ సూచీలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
అయితే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, మారుతీ, ఐషర్ మోటార్స్, ఐసీటీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications