Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. అమెరికా మార్కెట్ల చలవతో..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియటం సూచీలను నడిపిస్తోంది.
ఉదయం 9.31 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 21 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 118 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 59 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

NSEలో యూపీఎల్, హీరో మోటార్స్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, హిందాల్కొ, విప్రో, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications