Stock Market: లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడింగ్..
Stock Market: శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నేడు లాభాల్లో తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ట్రేడింగ్ మెుదలుపెట్టాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 45 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 77 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. క్యూ1 ఫలితాలు, కంపెనీల మెరుగైన లాభదాయకత వంటి అంశాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications