Market Opening: గతవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు శుభారంభాన్ని నమోదు చేశాయి. ప్రధానంగా ఐటీ రంగంలోని కంపెనీల పనితీరు మెరుగుపడటం లాభదాయకతను పెంచుతున్న వేళ మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి.
ఉదయం 9.53 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్ప ఒడిదొడుకుల్లో 27 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 50 పాయింట్లకు పైగా నష్టంతో ఇంట్రాడేలో తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. సెక్టోరల్ ఫ్రంట్ ఆటో, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ 0.5-1 శాతం పెరిగాయి. అలాగే రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. అలాగే బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

NSEలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, బ్రిటానియా, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టీసీఎస్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications