Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫెడ్ కీలక ప్రకటన..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల మద్దతుతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 59 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 161 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 83 పాయింట్లు లాభపడి ముందుసు సాగుతున్నాయి.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తాజాగా తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా మార్కెట్లు ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ఆసియా మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లపై సైతం ఇదే ప్రభావం కనిపిస్తోంది.
ఎన్ఎస్ఈలో సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, బీపీసీఎల్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎయిర్ టెల్, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications