Stock Market: బడ్జెట్ ప్రకటనకు ముందు ఈ వారమే చివరిది. దీంతో మదుపరులు నిజంగా ఆచితూచి అడుగేస్తారని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో భారత మార్కెట్ సూచీలు శుభారంభంతో ఈ వారాన్ని ప్రారంభించాయి. చాలా కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటం కూడా మార్కెట్లలో జోష్ కొనసాగటానికి ఒక కారణంగా తెలుస్తోంది.

సూచీల పరుగులు..
ఉదయం 9.50 గంటల సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 457 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 123 పాయింట్ల లాభంలో ఉండగా.. బ్యాంక్ నిఫ్టీ సూచీ 466 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 14 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు..
దేశీయ పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు సైతం పాజిటివ్ అవుట్ లుక్ ఇవ్వటంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు లాభాల్లో కొనసాగటం, దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడి కారణంగా ఇతర మార్కెట్లు సైతం తేరుకుని కొత్త గరిష్ఠాలకు చేరుకోవటం ఇండియా మార్కెట్లకు కలిసొస్తోంది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం రానున్న బడ్జెట్లో ఏఏ రంగాలకు తాయిలాలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో క్రయవిక్రయాలు చేయటం కొనసాగుతోంది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలోని హీరో మోటార్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, యూపీఎల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలోని అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications