Closing Bell: శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్, సోమవారం అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం సెలవు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూల ధోరణిలో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. కొత్త వారం దేశీయ మార్కెట్లు బుల్ జోరుతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 587 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 166 పాయింట్ల మేర లాభంలో ముందుకు సాగుతోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 377 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 300 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఐసీఐసీఐ, సిప్లా, జీ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

NSEలో సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎయిర్ టెల్, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, విప్రో, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications