Stock Market: గత మూడు రోజులుగా వరుస నష్టాలతో దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపదను మార్కెట్లు కోల్పోయాయి. అయితే నేడు దేశీయ సూచీలు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో గ్లెన్ మార్క్, విప్రో కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 42 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 282 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 189 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం ఇంకా ఒత్తిళ్లలోనే ఉన్నాయి.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గన్ భారతీయ బాండ్లను ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో చేర్చింది. ఇది విదేశీ మదుపరులను ఆకర్షించటంలో దోహదపడుతుందని తెలుస్తోంది. అలాగే పెరుగుతున్న చమురు ధరల కారణంగా బలహీనపడుతున్న కరెంట్ ఖాతా మధ్య భారత రూపాయిని బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ బెంచ్‌మార్క్‌లో చేర్చడం భారతదేశానికి ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది పెరిగిన విదేశీ మారకద్రవ్య ప్రవాహానికి దారి తీస్తుంది.
ఎన్ఎస్ఈలో ఎస్బీఐ, బజాజ్ ఫిన సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, కోల్ ఇండియా, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, బీపీసీఎల్, యూపీఎల్, రిలయన్స్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, సిప్లా, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, విప్రో, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎస్ టెక్, బజాజ్ ఆటో, నెస్లే, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, టాటా స్టీల్ కంపెనీల షేర్ల నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications