Stock Market: మార్కెట్లను కమ్మేసిన రేటింగ్ భయాలు.. నష్టాల్లో Sensex, Nifty..
Opening Bell: వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలను నమోదు చేస్తున్నాయి. నిన్నటి నష్టాలతో రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనప్పటికీ.. క్షీణత కొనసాగుతూనే ఉంది.
మార్కెట్ల ప్రారంభ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 248 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 159 సూచీ పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 83 పాయింట్లను కోల్పోయి ఇంట్రాడే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గిఫ్డ్ నిఫ్టీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. ప్రీఓపెనింగ్ సెషన్లో మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.

ప్రధానంగా ఫిట్ అమెరికా రేటింగ్ తగ్గించటం భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. యూఎస్ మార్కెట్ల ప్రభావం ప్రస్తుతం ఇండియా ఈక్విటీ మార్కెట్లపై పడింది.
ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, ఓఎన్జీసీ, నెస్లే, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, యూపీఎల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications