Stock Market: వారం మారినా తీరుమారని మార్కెట్లు.. నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్-నిఫ్టీ
Market Opening: గతవారం ఒడిదొడుకుల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్తవారంలో సైతం అదే తీరును ప్రదర్శిస్తున్నాయి. 5వ విడత ఎన్నికల్లో సైతం పోలింగ్ తక్కువగానే నమోదు కావటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 101 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 101 పాయింట్ల నష్టంలో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఉదయం గిఫ్ట్ నిఫ్టీ నష్టాల్లో ప్రారంభం కావటం నేడు మార్కెట్లకు దిక్సూచిగా నిలిచింది.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, హిందాల్కొ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, సిప్లా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో నెస్లే, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications