Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల్లో నేడు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరంభంలోనే నష్టాలతో మెుదలైన కీలక సూచీలు తర్వాత ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 80 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 334 పాయింట్ల భారీ లాభంతో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇక్కడ సూచీలు తమ నష్టాలను భర్తీ చేస్తూ వేగంగా లాభాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి ముందు రెండు ట్రేడింగ్ సెషన్లలో సైతం ఇదే ధోరణి కనిపించింది.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హీరో మోటార్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు కొనసాగుతున్నాయి. ఇండియా సిమెంట్స్ కంపెనీలో జరిగిన మెగా బ్లాక్ డీల్ కారణంగా అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్ లాభపడింది.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, విప్రో, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, నెస్లే, ఓఎన్జీసీ, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నేడు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications