Stock Market: ఫ్లాట్ ప్రారంభంలో మార్కెట్ సూచీలు.. యూఎస్ మార్కెట్ల నష్టాలతో..
Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి క్లోజింగ్ ధోరణినే కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లలోని మూడు కీలక సూచీలు నష్టాల్లో ముగియటంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై కనిపిస్తోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 96 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 12 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 100 పాయింట్ల లాభంతో పాజిటివ్ నోట్ కొనసాగిస్తోంది.

అమెరికా మార్కెట్లలో సేవా రంగం డేటా ఊహించిన దానికంటే బలంగా ఉన్నప్పటికీ.. అదుపులోకి రాని ద్రవ్యోల్బణం పరిస్థితులు ఎక్కువ కాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగనిస్తాయనే ఆందోళనలతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లు సైతం కొంత ఒడిదొడుకుల్లో ఉండటం దేశీయ సూచీలను నష్టాల్లోకి నెట్టింది.
ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, బీపీసీఎల్, టీసీఎస్, హీరో మోటార్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, విప్రో, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications