Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. వెంటాడుతున్న అమెరికా ఆసియా నష్టాలు..
Stock Market: గతవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం ఒడిదొడుకుల్లో స్టార్ట్ అయ్యాయి. ప్రధాన సూచీ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సూచనలు చేసినప్పటికీ.. ప్రీఓపెన్ మార్కెట్లు సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 266 పాయింట్ల నష్టాల్లో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 67 పాయింట్ల మేర నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 138 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రధానంగా ఫెడ్ మీటింగ్ తో పాటు, పెరుగుతున్న క్రూడ్ ధరలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో టాటా స్టీల్, బెల్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు ఫోకస్లో ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, విప్రో, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications