Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. రిజర్వు బ్యాంక్ ప్రకటన కోసం ఎదురుచూపు..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలకు బ్రేక్ పలికాయి. నేడు రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ట్రేడింగ్ ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయం 9.18 గంటల సమయంలో 263 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 231 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 156 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో పేటీఎం, ఐఆర్సీఓఎన్, బీఈఎల్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం క్షీణతను నమోదు చేశాయి. దీనికి తోడు నేడు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్న తరుణంలో మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, మారుతీ, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, సిప్లా, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, విప్రో, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బ్రిటానియా, నెస్లే, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, గ్రాసిమ్ బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications