Stock Market: నష్టాల్లో మెుదలైన స్టాక్ మార్కెట్లు.. పతనమైన ఫైనాన్స్ స్టాక్స్..
Market Opening: నిన్న మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. రిజర్వు బ్యాంక్ రిటైల్ రుణాల విషయంలో రిస్క్ వెయిటేజీ పెంచటంతో ఫైనాన్స్ స్టాక్స్ నేడు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్లు క్షీణతలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 365 పాయింట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 33 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో ముందుకు కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, మారుతీ, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టిఐఎమ్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, బ్రిటానియా, జేఎస్డబ్యూ స్టీల్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎన్జీపీసీ, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications