Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.. క్షీణించిన బజాజ్ ఫిన్ స్టాక్స్..
Market Opening Bell: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.32 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 32 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 24 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ మిడ్ క్యాప్ 94 పాయింట్ల ఆధిక్యంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి.

ప్రధానంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్ ఫైనాన్స్ చేసిన కొన్ని తప్పిదాలను లేవనెత్తింది. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న రుణాల మంజూరును నిలిపివేయాలని నిన్న నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతో స్టాక్ ధర దాదాపు 3 శాతానికి పైగా క్షీణించింది. సెంట్రల్ బ్యాంక్ ఫ్లాగ్ చేసిన సమస్యలను సరిదిద్దడానికి కట్టుబడి ఉన్నామని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. బజాజ్ ఫైనాన్స్ తన రెండు లెండింగ్ ఉత్పత్తులైన eCOM, Insta EMI కార్డ్ కింద రుణాల మంజూరు, పంపిణీని వెంటనే అమలులోకి తీసుకురావాలని RBI ఆదేశించింది.
ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హీరో మోటార్స్, టీసీఎస్, డార్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా పయనిస్తున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, గ్రాసిమ్, టాటా స్టీల్, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, విప్రో, ఏషియన్ పెయింట్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎల్ టిఐఎమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications