Stock Market: నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను కొనసాగిస్తున్నాయి. నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి పెట్టుబడిదారుల సంపద దాదాపు 8 లక్షల కోట్ల మేర ఆవిరి కాగా.. నేడు సైతం మార్కెట్లో బేజారును ప్రదర్శిస్తున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ39 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 276 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 2 పాయింట్ల మేర లాభంలో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రంగా ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, యూపీఎల్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, సిప్లా, మారుతీ, మహింద్రా అండ్ మహింద్రా, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్యూ స్టీల్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, టైటాన్, ఎల్ టి సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications