Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కీలక బెంచ్ మార్క్ సూచీలు అన్ని నష్టాల్లో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.37 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 299 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 107 పాయింట్లు నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 417 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 406 పాయింట్ల నష్టంలో ముందుకు సాగుతున్నాయి. బ్లాక్ డీల్ కారణంగా కార్ ట్రేడ్ టెక్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 3 శాతం మేర నష్టపోయాయి. ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ క్వాంట్ కార్యాలయాలపై ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలతో సెబీ దాడులు మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, విప్రో, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐలైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications