Stock Market: నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్-నిఫ్టీ.. RBI మీటింగ్ ముందు..
Market Opening: నిన్న భారీ లాభాలతో ట్రేడింగ్ కొనసాగించి ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. ఆరంభంలోనే సూచీలు స్వల్ప నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 63 పాయింట్ల నష్టంలో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 174 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో దూసుకుపోతోంది. ప్రధానంగా ఈవారంలో రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి దానిపై ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఇండసఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, టైటాన్, రిలయన్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకుపోతూ టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, టీసీఎస్, సన్ ఫార్మా, విప్రో, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications