Stock Market: నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ప్రపంచ మార్కెట్లకు వ్యతిరేకంగా..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని స్వల్ప నష్టాల్లో కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా ఫ్యూచర్లు, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ ఉదంయ ప్రారంభం లాభాలు మాత్రం ఆవిరయ్యాయి.
ఉదయం 9.29 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 35 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 114 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 232 పాయింట్లను కోల్పోయాయి. ఈ క్రమంలో ఎల్ టిఐఎమ్, జీ, ఐటీసీ, ప్రతాప్ స్నాక్స్, పేటీఎం వంటి కంపెనీల షేర్లు నేడు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, ఎల్ టి, మారుతీ, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications