Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప ఒడిదొడుకుల్లో తమ ట్రేడింగ్ ఫ్లాట్ గా ప్రారంభించాయి. వాస్తవానికి నేడు గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో సానుకూలంగా కొనసాగుతున్నప్పటికీ భారత మార్కట్లు మాత్రం స్వల్ప నష్టాల్లో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 337 పాయింట్లను నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 19 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. నిన్న పేటీఎం కంపెనీకి సానుకూలంగా ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పెట్టుబడికి మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. దీంతో నేడు స్టాక్ ఇంట్రాడేలో సానుకూలంగా లాభాల్లో కొనసాగుతోంది.

NSEలో మారుతీ, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టైటాన్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, నెస్లే, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నేడు లాభాల్లో కొనసాగుతూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, ఐటీసీ, సిప్లా, రిలయన్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications