Stock Market: నష్టాల్లో మెుదలైన సెన్సెక్స్, నిఫ్టీ..!!
Market Opening: నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో జీఎంఆర్ పవర్ కంపెనీ షేర్లు 5 శాతం పెరుగుదలను చూశాయి.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 8 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 17 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 234 పాయింట్ల పెరుగుదలను చూసింది. ప్రధానంగా నేడు మార్కెట్లు ఓలటాలిటీతో ముందుకు సాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, సన్ ఫార్మా, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, గ్రాసిమ్, టాటా కన్జూమర్ కంపెనీలు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ పైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటర్స్, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, మారుతీ, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications