Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు.. అమెరికా మార్కెట్లు..
Stock Market: ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి ప్రతికూలతలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు 10.33 గంటల సమయంలోనూ అలాగే కొనసాగుతున్నాయి. మార్కెట్లలో ఒలటాలిటీ కూడా భారీగానే ఉంది.

స్టాక్ మార్కెట్ సూచీలు..
ఉదయం 10.37 గంటల సమయంలో దేశీయ బెంచ్ మార్క్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 102 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 33 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 8 పాయింట్లు నష్టాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 25 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నానికి మార్కెట్లు తేరుకునే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని టైటాన్, యూపీఎల్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, బ్రిటానియా, గ్రాసిమ్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

రష్యా చమురు..
రష్యా నుంచి ఎగుమతి అవుతున్న చమురుపై ధరల పరిమితిని పెట్టాలని పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నంపై ప్రతీకారం తీర్చుకుంది. డిసెంబరు 5న విధించిన ధరల పరిమితిని పాటించే దేశాలకు చమురు అమ్మకాలను మాస్కో నిషేధిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు ఉక్రేనియన్ నగరమైన బఖ్‌ముట్ చుట్టూ ఉన్న రష్యన్ బలగాలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టే పనిలో పుతిన్ నిమగ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications