Stock Market: నిన్న స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించిన మార్కెట్లు నేడు మరింత బేజారాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లు ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 211 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 37 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 38 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న వేళ భారత మార్కెట్లు సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఈ రోజు ప్రధానంగా ఆటో రంగంలోని షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్ లో ఉన్నాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లో సైతం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అమెరిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు అంచనాలకు మించి ఉండటంతో మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తోంది.
NSE సూచీలో ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బ్రిటానియా, సిప్లా, ఓఎన్జీసీ, మారుతీ, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలో దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎన్జీపీసీ, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

HDFC Bank ఫలితాలు: సోమవారం మార్కెట్ భారీగా పడిపోతుందా?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కీలక అడుగు.. ఏప్రిల్ 20న ఏం జరగబోతోంది?

బంగారం, భూమి, స్టాక్ మార్కెట్.. ఈ ఏడాది తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ఆప్షన్ ఏదంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..



Click it and Unblock the Notifications