Market Opening: నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల పనితీరును అనుకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 33 పాయింట్లను కోల్పోయింది. ఆరంభంలో సూచీలు స్వల్ప లాభాలతో మెుదలైనప్పటికీ క్షణాల్లోనే అవి ఆవిరయ్యాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 154 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 42 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది.

ఈ రోజు మార్కెట్లో ప్రధానంగా నైకా కంపెనీ షేర్లు లాభపడగా.. ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్ కంపెనీ షేర్లు మాత్రం 2 శాతం మేర నష్టపోయాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగటం దేశీయ ఇన్వెస్టర్లను ఆచితూచి ముందుకు కొనసాగేలా ప్రేరేపిస్తోంది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎల్‌టిఐఎమ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, మారుతీ, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, సిప్లా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ఇంట్రాడే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications