Stock Market: బడ్జెట్ తర్వాత ఆనవాయితీగా జరిగేదే ఈరోజు కూడా కనిపిస్తోంది. ఇంతకీ ఎంటదంటారా అదే మార్కెట్లు నష్టపోవటం. దీనికి తోడు యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సైతం తన వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించటం ఏకకాలంలో జరిగాయి.

మార్కెట్ సూచీలు..
ఈ రోజు ఉదయం 9.15 గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ సూచీ 87 పాయింట్ల మేర నష్టాల్లో ఆరంభమైంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 381 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 69 పాయింట్ల మేర నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

ఫెడ్ నిర్ణయం..
ప్రధానంగా కొత్త ఏడాదిలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందనే దానిపై అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుత సమావేశంలో ఫెడ్ ఛైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించారు. ఇది యూఎస్ మార్కెట్లలో జోష్ నింపింది. ఈ సారి పావెల్ 0.25% మేర రేట్ల పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయం నిర్ణయం ఆర్థిక మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది. అయితే రానున్న కాలంలో సైతం రేట్ల పెంపు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ యూఎస్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి.

టాప్ గెయినర్స్..
ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే ఎన్ఎస్ఈ సూచీలో ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ విప్రో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, దీవీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ, బీపీసీఎల్, మారుతీ, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టి, రిలయన్స్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications