Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన Sensex, Nifty.. ఏమైంది..?
Stock Market: గత కొంత కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. కానీ ఈ వారం ప్రారంభంలో సూచీలు ఆచితూచి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఉదయం 9.31 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 22 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 16 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 24 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 150 పాయింట్ల లాభంపడి ముందుకు సాగుతోంది.

దేశీయ స్టాక్ మార్కెట్లపై చైనా నిరుద్యోగిత గణాంకాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువత నిరుద్యోగిత రికార్డు స్థాయిలో 21.3 శాతంగా ఉన్నట్లు వార్తలు రావటంతో మార్కెట్లు స్పీడ్ తగ్గించాయి.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టిఐఎమ్, విప్రో, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, నెస్లే, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, ఎల్ టి, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications