Stock Market: ఒడిదొడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస సెలవుల తర్వాత తెరుచుకున్నాయి. పైగా నేడు మార్కెట్లోకి అనేక ఐపీవోలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదొడుకుల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 19 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 74 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 216 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలతో భారత మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు భారీగానే నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, యూపీఎల్, హీరో మోటార్స్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటోతో సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications