Stock Market: వారాంతంలో లాభాల ప్రయాణం.. నిన్నటి నష్టాలకు బుల్స్ బ్రేక్..
Stock Market: నిన్న రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ ప్రకటన తర్వాత అనూహ్యంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే. అయితే నేడు వారాంతపు ట్రేడింగ్ ను సూచీలు లాభాల్లో ప్రారంభించాయి.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 125 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 107 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 114 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులపై అలుముకున్న ఆందోళనలు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్లు గత కొంత కాలంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు మాంద్యంలోకి జారుకున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బాండ్ ఈల్డ్స్ పెరగటం కూడా కొంత ఆందోళనలను పెంచుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఎన్ఎస్ఈలో బ్రిటానియా, టైటాన్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హిందాల్కొ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications