Stock Market: పడిలేచిన మార్కెట్లు.. వారం ప్రారంభంలో లాభాల బాట.. అంతా ఆ నిర్ణయం కోసం ఎదురుచూపు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాన్ని ఫ్లాట్ గా ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప నష్టాల్లోకి జారుకున్న సూచీలు కొన్ని నిమిషాల్లోనే తేరుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లలో నష్టాలు మన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చమురు కంపెనీలపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించటం మార్కెట్లకు ఊరటను ఇచ్చింది.

సూచీలు ఇలా..
ఉదయం 11.10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 333 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 336 పాయింట్ల లాభంలో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 82 పాయింట్లు పెరిగింది.

ఈ వారం మార్కెట్ల దిశ..
ప్రధానంగా ఈ వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించనుండటంతో మార్కెట్లు దాని కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఇది ఎంత మేర ఉంటుందనే ఆందోళనలో మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దీనికి తోడు ఈనెల చివరినాటికి రిజర్వు బ్యాంక్ సైతం ఎంపీసీ సమావేశంలో రెపో రేటు పెంపును ప్రకటించవచ్చని అందరూ భావిస్తున్నారు.

ఆసియా మార్కెట్లు..
మరోవైపు నేడు ఆసియా మార్కెట్లలో ఇన్వెస్టర్ల మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఈ ఉదయం సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.16 శాతం, తైవాన్ స్టాక్ మార్కెట్ కూడా ఈ ఉదయం 0.07 శాతం లాభపడగా, దక్షిణ కొరియా కోస్పి 0.30 శాతం క్షీణించింది. చైనా షాంఘై కాంపోజిట్ కూడా 0.03 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

గెయినర్స్ అండ్ లూజర్స్..
అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐఎన్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ లేబరేటరీస్, టెక్ మహీంద్రా షేర్లు ఆరంభంలో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో.. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, మారుతీ, ఎన్టీపీసీ, హీరో మోటొకార్ప్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో నిలిచి టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications