Stock Market: ఫుల్ జోష్‌లో మార్కెట్ సూచీలు.. సానుకూల పవనాలతో ముందుకు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాన్ని బలమైన లాభాలతో ప్రారంభించాయి. ఈవారం అనేక కీలక పరిణామాలు ఉండటంతో ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.
ఉదయం 9.38 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 286 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 72 పాయింట్ల గెయిన్ తో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 253 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 122 పాయింట్ల మేర లాభపడ్డాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లను ఫాలో అవుతున్నాయి. దీంతో కీలక సూచీలు లాభాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు రూ.500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలపై నేటి నుంచి నిఘా పెంచాయి. దీనికోసం కోసం మెరుగైన నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి.
NSEలో యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతీ, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కొ, ఓఎన్జీసీ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications