Stock market: కుదుటపడిన స్టాక్ మార్కెట్లు.. కొత్త వారంలో నష్టాల తీరాన్ని దాటిన సూచీలు..
Stock market: గతవారం భారీగా నష్టపోయిన దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగి అనేక మంది ఇన్వెస్టర్లు సంపదను కోల్పోయారు. కానీ కొత్త వారం మార్కెట్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈరోజు ఆరంభం నుంచి సూచీలు లాభాల్లో కొనసాగుతోంది. మాంద్యం భయాలు ముదురుతున్నప్పటికీ.. సూచీలు స్థిరంగా కొనసాగటం మదుపరుల్లో నమ్మకాన్ని పెంచుతోంది.
ఉదయం 11.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ 278 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 82 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 70 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఉదయం ఆరంభంలో మార్కెట్లు స్పల్ప లాభాలతో ఉన్నప్పటికీ క్రమంగా పుంజుకున్నాయి.

భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, మారుతీ, టైటాన్, హీరో మోటొకార్ప్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఓఎన్జీసీ, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, విప్రో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ఎన్ఎస్ఈ సూచీలో నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications