Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. జియో ఫైనాన్సియల్స్ లిస్టింగ్ నేడే..
Stock Market: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ఫ్లాట్ ఆరంభాన్ని చేశాయి. దీనికి ముందు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సూచీలు కొంత ఒత్తిళ్లలో కనిపించాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంలో ఉండగా.. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంక్ 118 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 112 పాయింట్ల మేర పెరిగి ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఉత్సాహంలో కొనసాగుసుతున్నాయి. ప్రధానంగా మార్కెట్ల చూపు జియో ఫైనాన్సియల్స్ లిస్టింగ్ పై ఉంది. దేశంలో రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీగా ఇది నిలవనుంది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టిఐఎమ్, విప్రో, టాటా కన్జూమర్, సిప్లా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, ఐటీసీ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు మాత్రం మార్కెట్లో నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications