Stock Market: ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరి చూపు రానున్న 2023 కేంద్ర వార్షిక బడ్జెట్ పైనే ఉంది. ఈ క్రమంలో పండుగ తర్వాత మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్నికల్ ఎనలిస్టులు సైతం మార్కెట్ల పనితీరుపై కొంత ఆశావహంగానే ఉన్నారు. ప్రధానంగా నేడు మార్కెట్లో ఐటీ కంపెనీలు లాభాల జోరుతో ముందుకు సాగుతున్నాయి. రానున్న రెండు వారాలు ఫలితాలకు తోడు, బడ్జెట్ ప్రసంగం కోసం పెద్ద ఇన్వెస్టర్లు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.

మార్కెట్ సూచీలు..
ఉదయం 11 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు, నిఫ్టీ సూచీ 14 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 152 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 25 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు సైతం కొంత కుదుటపడటం ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

టాప్ గెయినర్స్..
ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హిందాల్కొ, టైటాన్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, టాటా కన్జూమర్, బ్రిటానియా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications