Stock Market: లాభాల్లో కళకళలాడుతున్న మార్కెట్లు.. ఆ బలంతో ముందుకు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. గత 5 ట్రేడింగ్ సెషన్లలో సూచీలు సృష్టించిన విధ్వంసంతో మార్కెట్ ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

మార్కెట్ సూచీలు..
ఈరోజు ఉదయం 10.47 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 70 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 20 పాయింట్ల స్వల్ప లాభంలో కొనసాగుతున్నాయి.

అమెరికా సంకేతాలు..
యూఎస్ జీడీపీ వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో మెరుగుపడి 2.7 శాతానికి చేరుకుంది. ఇది మార్కెట్లకు మంచి బూస్ట్ ఇచ్చే అంశంగా ఉంది. దీనికి తోడు అమెరికా మార్కెట్లు నష్టాలకు బ్రేక్ వేశాయి. ఈ క్రమంలో అక్కడి టెక్ కంపెనీల షేర్లు సైతం పుంజుకోవటం ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపుతోంది. వృద్ధి మందగించినప్పటికీ, ఎలివేటెడ్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టడం అంటే రేట్లు మరింత పెరుగుతాయని US ఆర్థికవేత్త రుబీలా ఫరూఖీ అన్నారు.

టాప్ గెయినర్స్..
NSE సూచీలోని దివీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, నెస్లే, సన్ ఫార్మా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, యూపీఎల్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా కొనసాగుతూ లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్..
హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications