Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫోకస్‌లో ఆ రంగం షేర్లు..
Stock Market: నెల మెుదటి రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశీయ సూచీలు సైతం పాజిటివ్ నోట్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 21 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ జరుగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 72 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 131 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో ఉన్నాయి.

NSEలో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఎల్ టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిర్ టెల్, ఐటీసీ, సిప్లా, బజాజ్ ఆటో, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications