Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిన్నటి దారిలోనే Sensex, Nifty..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రీఓపెన్ సెషన్లో గిఫ్ట్ నిఫ్టీ సూచీ ఫ్లాట్ ట్రేడింగ్ ప్రారంభించింది.
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 59 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 255 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 10 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనీలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హిందాల్కొ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, యూపీఎల్, టైటాన్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications