Stock Market: భారీ నష్టాల్లో మెుదలైన మార్కెట్లు.. అమెరికా మార్కెట్ల నష్టాలతో..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఆందోళనలు అలుముకున్న వేళ ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లను కమ్మేస్తోంది.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 357 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 114 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 195 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 451 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లాభాల క్షీణతతో పాటు అమెరికా మార్కెట్లలో అలుముకున్న అమ్మకాల ఒత్తిళ్లతో యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగియశాయి.

దీనికి తోడు భారీగా పెరుగుతున్న యూఎస్ బాండ్ రాబడులు ఆందోళనలకు కారణంగా మారాయి. ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత మదుపరులు పెద్ద టెక్ కంపెనీల రెండవ త్రైమసిక ఫలితాలు నిరాశకు గురిచేసినప్పటికీ వాటిలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు. ప్రస్తుతం మంచి ఆర్డర్ బుక్ కలిగి ఉన్నందున తర్వాత త్రైమాసికంలో దీని ఫలితాలను అందుకోవచ్చని వారు భావిస్తున్నారు. దీనికి తోడు చైనాలో కొనసాగుతున్న రియల్టీ ట్రబుల్స్ అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
NSEలో కేవలం యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, విప్రో, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications