Stock Market: నష్టాల్లో మెుదలైన సెన్సెక్స్-నిఫ్టీ.. కొంప ముంచిన US మార్కెట్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అమెరికా మార్కెట్ల బాటలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును లేటు చేయనున్నట్లు తెలియటంతో పాటు టెస్లా కార్ల విక్రయాల సంఖ్య తగ్గటంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 92 పాయింట్ల మేర నష్టాల్లో ఇంట్రాడేలో తన ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 231 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 74 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతున్నాయి.ఈ క్రమంలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జీ కంపెనీల షేర్లు నేడు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో నెస్లే, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications