Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న ఫ్లాట్ ముగింపు తర్వాత నేడు నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం 9.56 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 185 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను నష్టాల్లోకి డ్రాగ్ చేశాయి.

ప్రధానంగా అమెరికాలో విడుదల కానున్న ద్రవ్యోల్బణం డేటా, రుణ పరిమితిపై అగ్ర నాయకుల మధ్య జరగనున్న చర్చల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. లేబర్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) నివేదికను అనుసరిస్తూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందా లేదా అనేదానిపై ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు.
NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బిపిసీఎల్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే క్రమంలో సూచీలో ఎస్బీఐ, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, గ్రాసిమ్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఎన్డీపీసీ స్టాక్స్ మార్కెట్లో నష్టాలతో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications